మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 22 జనవరి 2018 (21:13 IST)

వృద్ధుడు రాజకీయాల్లో ఏం ఇరగదీస్తాడూ... రజినీపై ఫైర్ అయిన డైరెక్టర్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై కొంతమంది సంతోషిస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ వ్యక్తి కాని రజినీ ఇక్కడ ఏం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు కొంతమంది ప్రముఖులు. తమిళ సినీపరిశ్రమలోని కొంతమంది ప్రము

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై కొంతమంది సంతోషిస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ వ్యక్తి కాని రజినీ ఇక్కడ ఏం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు కొంతమంది ప్రముఖులు. తమిళ సినీపరిశ్రమలోని కొంతమంది ప్రముఖ హీరోహీరోయిన్లు రజినీకాంత్ వైపు వెళ్ళేందుకు ప్రయత్నిస్తుండగా మరికొంతమంది మాత్రం రజినీపై మండిపడుతున్నారు.
 
అందులో తమిళ దర్శకుడు భారతీరాజా ఒకరు. రజినీ రాజకీయ ప్రవేశంపై భారతీరాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రజినీకాంత్ తమిళుడు కాదు.. వయస్సు అయిపోతయింది. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తాడో నాకైతే అర్థం కావడం లేదు. ఆయనెందుకు రాజకీయాలకు వెళుతున్నాడో అస్సలు అర్థం కావడం లేదు. రజినీకి ఏం అర్హత ఉంది అంటూ ఇష్టానుసారం రజినీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు దర్శకుడు భారతీరాజా. భారతీరాజా వ్యాఖ్యలపై రజినీ అభిమానులు మండిపడుతున్నారు. తన వ్యాఖ్యలను భారతీరాజా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.