శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (18:50 IST)

కొరటాల కోసం మహేష్‌, మరి.. మహేష్ కోసం కొరటాల ఏం చేస్తున్నాడో తెలుసా?

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో మహేష్‌ బాబుకు ప్రత్యేకమైన అనుబంధం. శ్రీమంతుడు, భరత్ అనే నేను... అనే రెండు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చాడు. తాజాగా కొరటాల శివ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా చేయడానికి కారణం కొరటాలతో మహేష్‌ బాబుకి ఉన్న అనుబంధం కూడా ఒక కారణం. 
 
ఇదిలా ఉంటే.. మహేష్‌ బాబు కోసం కొరటాల ఓ ఫేవర్ చేస్తున్నాడని తెలిసింది. అది ఏంటంటే...  మహేష్‌ బాబు తదుపరి చిత్రాన్ని పరశురామ్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ విషయంలో మహేష్ కొన్ని మార్పులు చెప్పారని.. ఆ మార్పులు విషయంలో కొరటాల శివ పరశురామ్‌కి కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. 
 
మహేష్‌ - పరశురామ్ కాంబినేషన్లో రూపొందే ఈ సినిమాని ఎవరు నిర్మిస్తారు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని.. ఇప్పటివరకు మహేష్‌ ఇలాంటి పాత్ర చేయలేదని తెలిసింది. అందుకనే మహేష్‌ ఈ కథకు ఓకే చెప్పాడట. కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్‌లో తన వంతు సహకారం అందిస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి ఈ మూవీపై మరింత ఆసక్తి  పెరిగింది. అయితే.. ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది..? అనేది త్వరలోనే తెలియనుంది.