శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2022 (18:47 IST)

#SSMB29 మేజర్ అప్డేట్ ఇచ్చిన జక్కన్న

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. తాత్కాలికంగా #SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఇప్పటికే జక్కన్న ఈ మెగా ప్రాజెక్ట్ బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లను మించి ఉంటుందని వెల్లడించి సినిమాపై హైప్‌ని ఆకాశాన్ని తాకేలా చేశారు. 
 
ఇక తాజాగా జక్కన్న సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్‌ను వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి చాలా ప్రీ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి మరో ఆరు నెలల్లో సినిమాను ప్రారంభించనున్నట్టు రాజమౌళి వెల్లడించారు.
 
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే మహేష్ , రాజమౌళి మూవీ 2023లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్నాడు. తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో #SSMB28ని చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక SSMB29 స్టార్ట్ అవుతుంది.