శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (11:51 IST)

నా జీవనరేఖలు వీరే... టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వైఫ్ పోస్ట్

సూపర్‌స్టార్ మహేష్‌బాబు భార్య, ఒకప్పట్లో హీరోయిన్ అయిన నమ్రతా శిరోద్కర్ పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి, బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అంతేకాకుండా ఈవిడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడూ తన భర్త, పిల్లల ఫోటోలు, వీడియోలను ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు ఆనందం పంచుకుంటూ ఉంటారు. తాజాగా నమత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ప్రిన్స్ మహేష్ బాబు, కుమారుడు గౌతమ్ కృష్ణ, కుమార్తె సితారతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్రత షేర్ చేస్తూ, ఈ ఫోటోలో ఉన్నవారంతా నా జీవన రేఖలు (లైఫ్‌లైన్స్) అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అంతటితో ఆగకుండా లవ్లీ ఫ్యాన్స్, బ్యూటిఫుల్ కపుల్ అంటూ వ్యాఖ్యల వర్షం కురిపిస్తున్నారు.
 
ఇక మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మహేష్, పూజా హెగ్డేపై అన్నపూర్ణ స్టూడియోలో రెండు పాటలను చిత్రీకరించడం పూర్తయ్యింది. ఇటీవల పాటలో మహేష్ బాబు స్టిల్‍కు సంబంధించిన ఫోటోను రిలీజ్ చేయగా అది క్రేజీగా మారింది.