మరోసారి ఉదారతను చాటుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి వలె కేవలం రీల్ పైనే కాదు, రియల్ గా కూడా పలు సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇటీవల తాను నటించిన శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ తరువాత ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో రెండు ఊళ్లను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న సూపర్ స్టార్, ఇటీవల 1000 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి, వారికి నూతన జీవితాన్ని అందించడం జరిగింది.
కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళానికి చెందిన సందీప్, అమలాపురానికి చెందిన షణ్ముఖ్ అనే ఇద్దరు చిన్నారులు హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న విషయం, తన అభిమానుల ద్వారా తెలుసుకున్న మహేష్, తన దయార్ద్ర హృదయంతో ఆంధ్ర హాస్పిటల్స్ ద్వారా వారిద్దరికీ గుండె ఆపరేషన్ చేయించడం జరిగింది.
ఇక ప్రస్తుతం ఆ చిన్నారులిద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, వారికి భగవంతుడు మంచి భవిష్యత్తును అందించాలని, ఇక వారికి ఆపరేషన్ నిర్వహించిన ఆంధ్ర హాస్పిటల్స్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మహేష్ బాబు అఫీషియల్ టీమ్ వారు తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇక మరొక్కసారి తన ఉదారతను చాటుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.