బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 18 సెప్టెంబరు 2017 (18:48 IST)

దసరాకు మహేష్ 'స్పైడర్' కుమ్మేయడం ఖాయం... సెన్సార్ టాక్ బూస్ట్...

బ్రహ్మోత్సవం ప్లాప్ దెబ్బతో నిరాశలో వున్న ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు స్పైడర్ మూవీ విందు చేయబోతోంది. ఈ దసరా పండుగ సందర్భంగా సెప్టెంబరు 27న విడుదలవుతున్న స్పైడర్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది.

ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు స్పైడర్ మూవీకి సింగిల్ కట్ కూడా చెప్పలేదంటే ఆ చిత్రం ఎంత బావుందో అర్థమవుతుందని అంటున్నారు. స్పైడర్ చిత్రంలో మహేష్ బాబు యాక్షన్ సీన్లు చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారట. దీనితో స్పైడర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తమ్మీద శ్రీమంతుడు చిత్రం తర్వాత బ్రహ్మోత్సవం పరాజయంతో వున్న మహేష్ బాబుకు ఈ చిత్రం బూస్ట్ ఇస్తుందనుకోవచ్చు.