అదృష్టలక్ష్మి నాతోనే ఉందంటున్న అనుష్క...
అదృష్టలక్ష్మి ఎప్పుడూ నా వెంటే ఉంటుంది.. నన్ను కనిపెట్టుకుని ఉంటుంది... నా దగ్గరకు ఎలాంటి సమస్య రానివ్వదు. నేను నటించే సినిమాలన్నింటినీ హిట్ చేసి నాకు డబ్బులను తెచ్చిపెడుతుంది.. ఇదంతా చెప్పింది ఎవరో కాదు దక్షిణాది ప్రముఖ హీరోయిన్ అనుష్క. ఈమధ్య అనుష్క
అదృష్టలక్ష్మి ఎప్పుడూ నా వెంటే ఉంటుంది.. నన్ను కనిపెట్టుకుని ఉంటుంది... నా దగ్గరకు ఎలాంటి సమస్య రానివ్వదు. నేను నటించే సినిమాలన్నింటినీ హిట్ చేసి నాకు డబ్బులను తెచ్చిపెడుతుంది.. ఇదంతా చెప్పింది ఎవరో కాదు దక్షిణాది ప్రముఖ హీరోయిన్ అనుష్క. ఈమధ్య అనుష్కకు అదృష్టం బాగా కలిసొచ్చినట్లుంది. ఏ సినిమాలో నటించినా ఆ సినిమా బాగా హిట్టయిపోతోంది. అందుకే అనుష్క ఇలా చెప్పిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
బాహుబలి తరువాత వరుస సినిమాలతో బిజీ అయి పోయిన అనుష్క తన స్నేహితులు ఎవరు కనబడినా సంతోషంగా ఇదే చెబుతోందట. నాకు అదృష్టం కలిసొచ్చింది. ఆ అదృష్టం అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నా.. నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. ఉండబోదు.. ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లే.. మంచి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.. అవి బాగా హిట్టవుతున్నాయి అంటూ అనుష్క సంతోషాన్ని పట్టలేకపోతోందట.