బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (17:17 IST)

ఉగాదికి శుభవార్త...మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ.. మహర్షి టీజర్?

'భరత్ అనే నేను' పొలిటికల్ సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సందేశాత్మక చిత్రం మహర్షి. ఇది మహేష్ బాబు నటిస్తున్న 25వ సినిమా కావడంతో అభిమానులలో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అనుకోని అవాంతరాల వలన దీని విడుదల తేదీ వాయిదాలు పడుతూ చివరికి మే 9వ కన్ఫామ్ చేసారు చిత్ర యూనిట్. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి ఈ సినిమాకు. 
 
అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. మహర్షి టీజర్‌ను పేరు అనగా ఏప్రిల్ 6వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు వంశీ పైడిపళ్లి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
 
ఉగాది పండుగ రోజున ఉదయం 9 గంటల 9 నిమిషాలకు మహర్షి టీజర్ విడుదల చేయబడుతుంది. మీరంత రిషిని కలుసుకోవచ్చు. రిషిగా సూపర్‌స్టార్ ప్రయాణం మీ వంతు భాగం పంచుకోవాలంటూ వంశీ పైడిపల్లి ట్వీట్ చేశారు. ఈ సినిమాలో పూజ హెగ్డె హీరోయిన్‌గా, కీలక పాత్రలో అల్లరి నరేష్, మీనాక్షి దీక్షిత్ నటిస్తుండగా, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సాయి కుమార్, జయసుధ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.