శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 17 డిశెంబరు 2018 (10:11 IST)

పీవీ సింధు విజయంపై స్పందించిన సూప‌ర్ స్టార్

భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు సూపర్ స్టార్ మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఇంత‌కీ ఎందుకంటారా..? బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో పీవీ సింధు బంగారు పతకం సాధించింది. ఈ ఘనతను సాధించిన‌ తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. జపాన్ స్టార్, వరల్డ్ ఛాంపియన్ నవొమి ఒకుహరతో ఫైనల్ మ్యాచ్‌లో 21-19, 21-17 తేడాతో వరుస సెట్లలో పీవీ సింధు విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 
 
ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించడంతో వరల్డ్ టూర్ ఫైనల్స్‌ విజేతల జాబితాలో భారత్ పేరును నిలిపిన సింధుపై సూపర్ స్టార్ మహేష్‌ బాబు ప్రశంసలు కురిపించారు. ‘ఎంత అద్భుతమైన ఘనత. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను గెలిచిన పీవీ సింధుకి అభినందనలు. నిన్ను చూసి యావత్ దేశం గర్వపడుతోంది. నువ్వు మరిన్ని ఉన్నత స్థానాలను అందుకోవాలి అని ట్వీట్‌లో మహేష్ బాబు పేర్కొన్నారు.