శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 మార్చి 2018 (12:01 IST)

''భరత్ అనే నేను'' 20 రోజులూ అలా చేస్తారట..?

శ్రీమంతుడు తరహాలో బంపర్ హిట్ కొట్టేందుకు కొరటాల శివ, మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. ''భరత్ అనే నేను'' సినిమాతో మళ్లీ కొరటాల శివ- మహేష్ జోడీ తెరపైకి రానుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు

శ్రీమంతుడు తరహాలో బంపర్ హిట్ కొట్టేందుకు కొరటాల శివ, మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. ''భరత్ అనే నేను'' సినిమాతో మళ్లీ కొరటాల శివ- మహేష్ జోడీ తెరపైకి రానుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు సమాచారం. చివరి షెడ్యూల్‌ లండన్‌లో జరుగుతోంది. ఓ పాట కొన్ని సీన్స్ పూర్తయ్యాక.. సినిమా విడుదలకు సంబంధించిన తేదీని ప్రకటించాలని సినీ యూనిట్ భావిస్తోంది.
 
ఇందులో భాగంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించాలనుకోవాలని సినీ యూనిట్ భావిస్తోంది. అది కూడా కొత్తగా ఈ సినిమా ప్రమోషన్స్ వుంటాయని యూనిట్ వర్గాల సమాచారం. 
 
ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి సినీమా రిలీజ్ అయ్యే ఏప్రిల్ 20 వరకూ ప్రతి రోజూ ప్రమోషన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. 20 రోజుల పాటు ఈ సినిమా గురించే సినీ జనం మాట్లాడుకునేలా ఈ ప్రమోషన్స్ వుంటాయట. మరోవైపు ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ 7న రిలీజ్ చేయ‌బోతున్నార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఆడియో రిలీజ్ డేట్‌, వేదిక‌పై సినీ యూనిట్ క్లారిటీ ఇవ్వనుంది.