గణేష నిమజ్జన వేడుకలో మహేష్ తనయుడు.. దుర్గం చెరువులో నిమజ్జనం..!
గణపతి నిమజ్జనంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ సందడి చేశాడు. హైదరాబాదులో గణపతి నిమజ్జనం ఉత్సాహంగా జరుగుతోంది. గణపతిని పూజించి, విగ్రహాలను నిమజ్జన ఘట్టం వైభవంగా జరుగుతోంది. ఈ ఉత్సవాల్
గణపతి నిమజ్జనంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ సందడి చేశాడు. హైదరాబాదులో గణపతి నిమజ్జనం ఉత్సాహంగా జరుగుతోంది. గణపతిని పూజించి, విగ్రహాలను నిమజ్జన ఘట్టం వైభవంగా జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా గణపతి బొప్పా మోర్యా అంటూ సందడి చేశాడు. తన ఇంట్లో ప్రతిష్టించుకొన్న వినాయకుణ్ణి నిమజ్జనం చేశాడు.
తలకి రిబ్బన్ కట్టి తన స్టాఫ్ కలిసి సందడి చేస్తూ గణపతిని ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్లాడు గౌతమ్ కృష్ణ. ఆపై హైదరాబాద్లోని దుర్గం చెరువులో నిమజ్జనం చేశాడు. మహేష్ బాబు తనయుడిని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. కాగా ఇప్పటికే మహేష్ బాబు నటించిన నేనొక్కడినే చిత్రం ద్వారా గౌతమ్ వెండితరకు పరిచయం అయ్యాడు.
దుబాయ్లో తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న గౌతమ్ ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చాడు. వెంటనే వినాయక చవితి సందడితో పాల్గొన్నాడు. తండ్రితో కలిసి ఇంట్లోనే బుజ్జి వినాయకుణ్ని ప్రతిష్టించుకుని పూజలు చేశాడు. మహేష్ కూడా ఈ పూజలో పాల్గొని అనంతరం షూటింగ్ కోసం చెన్నై వెళ్లిపోయాడు.