శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (14:40 IST)

చిన్నవయసులోనే మలయాళ నటి సుభి సురేష్ కన్నుమూత

subhi suresh
మలయాళ నటి సుభి సురేష్ చిన్నవయసులోనే కన్నుమూశారు. ఆమె వయసు 42 యేళ్లు. గత కొన్ని రోజులుగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతూ వచ్చిన ఆమె.. కొన్ని రోజులుగా కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ వచ్చారు. అయితే, ఆమె ఆరోగ్యం విషమించడంతో బుధవారం మృతి చెందారు. ఆమెకు కాలేయ మార్పిడి చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇంతలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. 
 
మలయాళ బుల్లితెర నటిగా, డ్యాన్సర్‌గా, హాస్య నటిగా, యాంకర్‌గా సుభి సురేష్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆమె నిర్వహించిన సినిమాల, కుట్టిపట్టాలం టీవీ షోలకు ఎంతో ఆదరణ లభించింది. ఆమె మంచి మిమిక్రీ ఆర్టిస్టు కూడా. 
 
ఆమె మిమిక్రీలకు మంచి ఆదరణ కూడా ఉంది. ఎన్నో మంచి టీవీ షోలలో ఆమె కీలక పాత్ర కూడా పోషించారు. 20కి పైగా చిత్రాల్లో నటించారు. ఫిట్నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సుభి... కాలేయ వ్యాధిబారినపడి మృతి చెందారు. సుభికి తండ్రి సురేష్, తల్లి అంబిక, సోదరురు అభి సురేష్ ఉన్నారు.