శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (12:43 IST)

నటి భావన కిడ్నాప్.. రేప్ కేసు : ఇద్దరి అరెస్టు

సినీ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో కేరళ పోలీసులు పురోగతి సాధించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుల్లో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి భావన షూటింగ్ ముగించుకుని కొచ్చికి వ

సినీ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో కేరళ పోలీసులు పురోగతి సాధించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుల్లో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి భావన షూటింగ్ ముగించుకుని కొచ్చికి వస్తుండగా.. ఆమె డ్రైవర్ మార్టిన్, మాజీ డ్రైవర్ సునీల్ కుమార్‌లు ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి.. కారులోనే లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... మార్టిన్‌ను శనివారమే అరెస్టు చేశారు. ఆదివారం ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ సహా ఇద్దరిని అరెస్టు చేశారు. కోచి నగర పోలీస్ కమిషనర్ ఎంపీ దినేశ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. కాలమసేరీ మెడికల్ కాలేజీ వివరణాత్మక వైద్య నివేదికను ఇచ్చిందని, కాలమసేరి మెజిస్ట్రేట్ కోర్టుకు ఇన్ కెమెరా (రహస్య) నివేదికను సమర్పించామని చెప్పారు. 
 
భావన దగ్గర మార్టిన్‌ను డ్రైవర్‌గా చేర్పించింది సునీలేనని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే ఇద్దరి మధ్య 40 సార్లు ఫోన్ సంభాషణలు జరిగాయని, అంతేగాకుండా ఆమె ఎక్కడకు వెళ్లేది, ఎప్పుడు వెళ్లేది మెసేజ్‌ల రూపంలోనూ చర్చించుకున్నారని తెలిపారు.