శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2016 (12:16 IST)

సబర్ణ ఆత్మహత్య మరవకముందే.. మలయాళ నటి రేఖా మోహన్ అనుమానస్పద మృతి.. ఏమైంది?

నిన్నటి నిన్న బుల్లితెర నటి సబర్ణ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, మలయాళ సినీ, టీవీ నటి రేఖా మోహన్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది. తమిళ సినీ పరిశ్రమలోనూ రెండు రోజుల క్రితం ఇలాగే

నిన్నటి నిన్న బుల్లితెర నటి సబర్ణ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, మలయాళ సినీ, టీవీ నటి రేఖా మోహన్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది. తమిళ సినీ పరిశ్రమలోనూ రెండు రోజుల క్రితం ఇలాగే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నటి సబర్ణ చైన్నైలోని తన ఫ్లాట్‌‌లో మరణించినట్టు తరుణంలో శనివారం కేరళలో త్రిసూర్‌‌లోని రేఖ అపార్ట్‌ మెంట్‌‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. రేఖ మృతి కారణం ఇంకా తెలియరాలేదు. పలు సినిమాలు, టీవీ సీరియల్‌లలో నటించింది. 
 
ఇంటికి దూరంగా ఉన్న రేఖ భర్త గత రెండు రోజులుగా మాట్లాడేందుకు అందుబాటులోకి రాలేదు. అనుమానంతో త్రిసూర్ పోలీసుల సాయం కోరాడు. పోలీసులు రేఖ అపార్ట్‌ మెంట్‌ కు వెళ్లి తలుపులు పగలకొట్టి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. అపార్ట్‌ మెంట్‌ లోపల లాక్‌ చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం త్రిసూర్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.