బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (13:14 IST)

రాధేశ్యామ్‌కు మ‌మేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డంలేదు

Mamesh Babu, Prabhas
ప్ర‌భాస్ సినిమా రాధేశ్యామ్‌కు హిందీ వ‌ర్ష‌న్‌కు అమితాబ్ బ‌చ్చ‌న్ వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్న‌ట్లు తెలిసిందే. ఇటీవ‌లే ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అలాగే తెలుగులో మ‌హేష్‌బాబు వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ విషయాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ‌కుమార్ ఖండించారు. సోష‌ల్ మీడియాలో మ‌హేష్‌బాబు అని వార్త‌లు రాసేశారు. కానీ ఆయ‌న కాదు. త్వ‌ర‌లో మీకు నిర్మాత‌లే ప్ర‌క‌టిస్తార‌ని చెప్పారు.
 
అయితే, ఇద్ద‌రు ముగ్గురు హీరోల‌ను అనుకుంటున్నామ‌నీ ద‌ర్శ‌కుడు చూచాయిగా చెప్పారు. హిందీలో బిగ్ బి చెప్ప‌డంతో తెలుగులో ఆ స్థాయి వున్న హీరో మెగాస్టార్ చిరంజీవి చెబుతాడ‌నే టాక్ కూడా వుంది. లేదంటే ఎన్‌.టి.ఆర్‌. ఇందుకు స‌రైన  వ్య‌క్తి అయి మ‌రో టాక్‌. ఏదిఏమైనా కొద్దిరోజుల్లో ఆ విష‌యం తెలియ‌నుంది. ఇక‌, రాధే శ్యామ్ ఏప్రిల్‌లో విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా నేటి నుంచే ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు.