మాతృపరిశ్రమపై నయనకు ఎంత ప్రేమ.. క్రమశిక్షణ నటి అంటూ కితాబు!
దక్షిణాది హీరోయిన్‌గా నిలిచిన నయనతార.. టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న అగ్ర నాయికగానూ గుర్తింపు తెచ్చుకుంది. పారితోషికానికి ఎంతగా వీడని నయనతార.. పబ్లిసిటీ మాటకు పోనే పోదు. తెలుగు - తమిళ్‌లో అప్పట్లో ఈ అమ్మడిపై బోలెడంత నెగెటివ్ ప్రచారం సాగింది. కానీ దీనికి పూర్తి ఆపోజిట్‌గా మాట్లాడుతున్నాడు మలయాళ దర్శకుడు సాజన్. ప్రస్తుతం ఈయన మమ్ముట్టి - నయనతార కాంబినేషన్లో మలయాళ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో నటించమని అడిగినప్పుడు నయన్ ఏమాత్రం నయన్ బెట్టు చేయక ఒప్పేసుకుందిట. మాతృ పరిశ్రమలో నటించేందుకు పారితోషికం కూడా అడ్డు కాలేదు. నిజానికి అంత పెద్ద బిజీ స్టార్ అయి ఉండీ పారితోషికంతో పని లేకుండా ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారు నయన్. ఉదయమే 9.30కి సెట్స్ కి రావాలని చెబితే అరగంట ముందే అక్కడ ఉంటారు. ఎంతో క్రమశిక్షణ ఉన్న నటి.. అంటూ కితాబిచ్చేశాడు.