శుక్రవారం, 4 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జూన్ 2025 (12:54 IST)

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

Mangli
ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల వినియోగం జరుగుతోందన్న పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. 
 
పోలీసులు జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో గంజాయి ప్యాకెట్లు, ఖరీదైన విదేశీ మద్యం సీసాలు లభ్యమైనట్లు సమాచారం. దీంతో పార్టీలో ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా, కొందరికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
డ్రగ్స్ వినియోగించిన వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనతో తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి మాదకద్రవ్యాల వాడకంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా యువత ఇలాంటి పార్టీల పేరుతో పెడదారి పడుతున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.