ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (10:41 IST)

పవన్ కోసం రాసిన కథ ఇదే.. ఛాన్సిస్తే సినిమా తీస్తా : మహేష్ సోదరి

తెలుగు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు మంజుల అనే సోదరి ఉన్నారు. ఈమె తాజాగా ఓ కథ రాశారు. అదీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి రాశారు. ఈ కథను పవన్ కళ్యాణ్ వింటే ఖచ్చితంగా ఓకే చెపుతారని చెప

తెలుగు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు మంజుల అనే సోదరి ఉన్నారు. ఈమె తాజాగా ఓ కథ రాశారు. అదీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి రాశారు. ఈ కథను పవన్ కళ్యాణ్ వింటే ఖచ్చితంగా ఓకే చెపుతారని చెప్పుకొచ్చింది. 
 
తాజాగా ఆమె 'మనసుకు నచ్చింది' అనే చిత్రం తీయగా, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగాసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె తాను రాసిన స్టోరీ లైన్‌ను బహిర్గతం చేశారు. ప్రస్తుతం తాను సినిమా రంగంలో టాప్ పొజిషన్‌లో ఉన్న ఓ హీరో, ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎలా వెళ్లాడన్న విషయంపై కథ రాసుకున్నట్టు చెప్పుకొచ్చింది. 
 
తన కథ పవన్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని, తనకు అవకాశం లభిస్తే ఆయనతో సినిమా తీస్తానని వెల్లడించింది. తాను హీరోను దృష్టిలో పెట్టుకుని కథలు రాయనని, కథ రాశాక ఎవరు సరిపోతారా? అని ఆలోచిస్తానని పేర్కొంది. మహేష్ బాబు ఇమేజ్‌కి తగిన కథ తయారు చేయడం తన కలని చెప్పుకొచ్చింది.