బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (13:23 IST)

ఏపీ సీఎం నెక్ట్స్ ప్లాన్ ఏంటి? పవన్‌ జేఏసీ ఎంతవరకు వచ్చింది?

ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో వివిధ రూపాల్లో నిరసన తెలిపిన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తదుపరి చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఇందు

ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో వివిధ రూపాల్లో నిరసన తెలిపిన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తదుపరి చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఇందులో భాగంగా తదుపరి చర్యలపై చంద్రబాబు నాయుడు పార్లమెంట్ సభ్యులను సలహా అడిగారు. ఈ మేరకు ఎంపీలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. 
 
రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని  జాతీయ స్థాయిలో గొంతెత్తి  చాటారని విషయాన్ని కొనియాడారు.  అదే స్ఫూర్తితో తదుపరి సమావేశాల్లోనూ నిరసనలు తెలిపి.. డిమాండ్లను సాధించుకురావాలని పిలుపు నిచ్చారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు కేంద్రం సానుకూల సంకేతాలు పంపిందనే విషయాన్ని ఓ ఎంపీ ప్రస్తాలించారు. 
 
జోన్, హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజీ, విద్యాసంస్థలు, రాజధానికి నిధులు తదితర విషయాలపై చంద్రబాబుతో చర్చించారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వుండాలని చంద్రబాబు ఆదేశించారు.  
 
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్‌తో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలపై వీరిద్దరూ చర్చిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. ఇప్పటికే జేఏసీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వున్న పవన్.. అందులో లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్‌లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.