గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (11:32 IST)

Manoj lost his way: దారి తప్పిన మనోజ్ : త్రిపురనేని చిట్టి బాబు

Tripuraneni Chitti Babu
Tripuraneni Chitti Babu
మోహన్ బాబు కడుపున మనోజ్ చెడపుట్టాడని నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టి బాబు ఘాటుగా స్పందించారు. ఇదంతా మంచు విష్ణు ఆధ్వర్యంలో  జరిగిన కాంటినెంటర్ ఆసుపత్రి వేడుకలో మీడియాతో ఆయన మాట్లాడారు. అదేవిధంగా మీడియాను కూడా ఆయన తప్పు పట్టారు. వ్యక్తిగత విషయాల్లోకి దూరి మొహం మీద మైక్ పెడితే మోహన్ బాబుకేకాదు ఎవరికైనా కోపం వస్తుందని ఇంటి దగ్గర జరిగిన సంఘటనను గుర్తుచేశారు.
 
మోహన్ బాబు ఇంటిపై మనోజ్ దాడి చేశాడనీ, మనోజ్ తనపై చేయి చేసుకున్నారని ఇరువురూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం తెలిసిందే. అయితే మనోజ్ అంతకుమించినట్లు ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. విష్ణు ను కొట్టించడానికి మనోజ్ తాండూరు నుంచి రౌడీలను తెప్పిస్తాడా..? తండ్రి, అన్నపై దౌర్జాన్యం చేస్తాడా..? ఏం మోహన్ బాబుకి, విష్ణులకు రౌడీలు లేరా..? తెప్పించలేరా..? దారి తప్పిన మనోజ్ ను ఓ తండ్రిగా సన్మార్గంలో పెట్టాలనుకోవడం మోహన్ బాబు చేసిన తప్పా..? ఇవన్నీ గ్రహించాలి. అసలు మీడియాకు ఏమీ తెలియదు. ఏదో ఊహించుకుని రకరకాలుగా వార్తలు రాసేస్తున్నారు. ప్రతి ఇంటిలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే వుంటాయి. అలాంటిదే మోహన్ బాబు ఇంటిలో జరిగింది అని అన్నారు.