ఆదివారం, 24 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (17:22 IST)

చిరంజీవి గారి రిఫరెన్స్ తోనే మట్కా తీశా : డైరెక్టర్ కరుణ కుమార్

Director Karuna Kumar
Director Karuna Kumar
నేను చిరంజీవి గారికి అభిమాని. వరుణ్  తేజ్ తో మట్కా తీశాను. చిరంజీవి గారి రిఫరెన్స్ లు ఇందులో వున్నాయని.. దర్శకుడు  కరుణ కుమార్ అన్నారు. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మట్కా' నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
-మట్కా కథకి ఆద్యం ఒక ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్ లో పడింది. మా అత్తగారిది వైజాగ్. ఓ మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. మా వైఫ్ తరఫున బంధువుల్లో ఒక అతను పంటర్ గా పని చేశాడు. ఏజెంట్స్ లా అన్నమాట. అప్పుడు ఫస్ట్ టైం ఈ మట్కా గేమ్ గురించి విన్నాను. ఆ మాటల సందర్భంలో వైజాగ్ లో నైట్ క్లబ్బులు, క్యాబరీలు ఉండేవని తెలుసుకున్నాను. నేనెప్పుడూ వైజాగ్ వెళ్ళినా జగదాంబతో ఆగిపోయావడిని. వైజాగ్ వన్ టౌన్ గురించి, అక్కడ కల్చర్ తెలుసుకున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అక్కడి నుంచి అసలు ఈ గేమ్ ఎవరిది అనేది పరిశోధించడం మొదలుపెట్టాను. ఒక కథకుడిగా దీన్ని 'వాడిపోయిన పువ్వులు' పేరుతో ఒక షార్ట్ స్టోరీ గా రాయాలనుకున్నాను. కానీ రాస్తున్నప్పుడు ఇది సినిమా మెటీరియల్ అని అర్థమైంది. అప్పుడు ఒక ట్రీట్మెంట్ వెర్షన్ రాసుకున్నాను. అది ఫస్ట్ డ్రాఫ్ట్. ఈరోజు చూస్తున్నది 12 డ్రాఫ్ట్.
 
- మట్కా ఒక మనిషి లైఫ్ జర్నీ. వాసు బర్మా నుంచి వైజాగ్ కి ఒక శరణార్థిగా వస్తాడు. వైజాగ్ లో ఉన్న పెద్ద పెద్ద పవర్ఫుల్ పర్సన్స్ అంతా బయట నుంచి వచ్చిన వాళ్లే. అప్పటి వైజాగ్ వెనుక ఉన్న క్రైమ్, గ్లామర్, కాస్మోపాలిటన్ కల్చర్ ఇవన్నీ కథలో భాగమే.
 
సెల్ ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్ ని పంపించడం అనేది ఈ కథలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. నిజంగా అది ఎలా జరిగిందో ఇప్పటికి నాకు తెలియదు. ఒకవేళ నేనే రతన్ ఖత్రీ అయివుంటే ఏం చేసేవాడిని అని తనలా ఆలోచించి ఆ ఐడియాస్ తో ఈ స్క్రిప్ట్ ని చేశాను.
 
మట్కా లో రతన్ ఖత్రి గారి జీవితాన్ని తీసుకోలేదు. ఆయన కథని ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ గా తీరుస్తున్నారు. అది వెబ్ సిరిస్ గానే తీయాలి. సినిమాకి వర్కౌట్ అవ్వదు. ఇందులో ఒకటే సిమిలారిటీ ఏంటంటే.. రతన్ ఖత్రి పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చారు. ఇందులో వాసు బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. అంతే. వైజాగ్ లో బర్మా కాలనీ వుండేది. అందులో రకరకాల మనుషులు వుండేవారు.  
 
-జీవి ప్రకాష్ కుమార్ నేను కథ చెప్పిన రెండు నిమిషాలకే కనెక్ట్ అయిపోయారు. కథ నెక్స్ట్ లెవెల్ లో ఉందని అని చెప్పారు. జీవి మ్యూజిక్ చేసిన ఈ దీపావళి సినిమాలు అమరన్,  లక్కీ భాస్కర్ మంచి విజయం సాధించాయి. మట్కా హ్యాట్రిక్ అవుతుంది. ఆ రెండు సినిమాలు కంటే పవర్ఫుల్  మ్యూజిక్ కి  స్కోప్ వున్న సినిమా ఇది. ఆ స్కోప్ ని మాక్సిమం వాడుకున్నాడు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.