గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (22:16 IST)

ప్రభుత్వ టీచర్లు అనుకుంటే ప్రైవేట్ స్కూల్స్ మూతపడతాయ్: నారా లోకేష్ (video)

Nara lokesh
Nara lokesh
విద్యా వ్యవస్థల్లో ఇతర శాఖల్లో తీసుకున్నట్లు నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే వుండదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. మనం తీసుకునే నిర్ణయం లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడివుంది. అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జీఓ117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేశారని.. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చెయ్యలేదని ఆరోపించారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. "గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా వ్యవస్థను గాడిన పెడతాం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చెయ్యడమే నా ఎజెండా. కేజీ టూ పీజీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. 
 
ఐదేళ్లలో అందరూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకునే విధంగా చేస్తాను. క్లాస్‌కి ఒక టీచర్ ఖచ్చితంగా ఉండాలనేది నా లక్ష్యం. ప్రభుత్వ టీచర్లు అనుకుంటే ప్రైవేటు స్కూళ్లూ మూతపడతాయి. మీలో కమిట్‌మెంట్ ఉంది. ఏం ఇబ్బంది ఉన్నా అండగా నిలబడే ప్రభుత్వం ఉంది" అంటూ నారా లోకేష్ అన్నారు.