గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (15:04 IST)

నారా లోకేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఇదేనా? ఫోటో వైరల్

Nara Lokesh
Nara Lokesh
దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచే మంత్రుల్లో ఒకరైనప్పటికీ, మంత్రి నారా లోకేశ్ అనేక ట్రోల్స్‌కు గురయ్యారు. దీంతో తొలి ఎన్నికల్లో ఓటమికి గురయ్యారు. ఎన్నికల తర్వాత లోకేష్ తనను తాను మలచుకుని అవమానాలను తన విజయానికి సోపానాలు చేసుకున్నారు. బరువును తగ్గించుకున్నారు. ఇంకా వక్తృత్వ నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకున్నారు. తద్వారా నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాల్లో అత్యుత్తమ వక్తలలో ఒకరిగా నిలిచారు. 
 
ఆంధ్రా రాజకీయాల్లో కీలకంగా రాణిస్తున్న నారా లోకేష్.. ఎన్నికలకు ముందు 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర కూడా చేశారు. ఏపీ ప్రస్తుత సీఎం చంద్రబాబు అరెస్టు కాకపోతే, మరే ఇతర తెలుగు రాజకీయ నాయకుడు చేయనంత ఎక్కువ దూరం నడిచి ఉండేవారు. గత ఐదేళ్లలో ఆయన ప్రజాదరణ ఎంతగా పెరిగిందంటే, రికార్డు మెజారిటీతో చాలా కష్టతరమైన సీటు అయిన మంగళగిరి నుంచి గెలిచారు.
 
ఫలితంగా ఏపీకి అత్యధిక పెట్టుబడులు తీసుకొచ్చిన మంత్రిగా నారా లోకేష్ నిలిచారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్‌కు ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. తాజాగా ఆయన ఫోటోతో కూడిన ఆటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫోటో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. 
 
ఆటో వెనుక వైపు నారా లోకేష్ ఫోటోను చూడవచ్చు. ఆటో డ్రైవర్లు తరచుగా మాస్ లీడర్ల ఫోటోలను వాడుతుంటారు. సినిమా హీరోల చిత్రాలను మనం తరచుగా ఆటోలపై చూస్తుంటాం. అయితే అందరు హీరోలు ఆటోల్లో కనిపించరు. 
 
అత్యున్నత మాస్ ఇమేజ్ ఉన్నవారికే ఆ అవకాశం కూడా దక్కుతుంది. రాజకీయ నాయకులు ఆటోలపై ఫిగర్‌ వేసుకోవడం చాలా అరుదు. అలాంటిది 2019కి ముందు నారా లోకేష్ ఎక్కడున్నారో, ఈరోజు ఆయన ప్రజాదరణ పొందిన వ్యక్తిగా సామాన్య ప్రజల గుండెల్లో వున్నారనేందుకు ఈ ఫోటోనే నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.