మిల్కీబ్యూటీతో కలిసి ముంబైలో మెగాస్టార్..!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మించగా, నయనతార, తమన్నా, అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి అగ్రనటీనటులు నటించారు.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, తాజాగా రీసెంట్‌గా ప్రమోషన్ కార్యక్రమాల కోసం ముంబై వెళ్ళారు. తమన్నాతో కలిసి మీడియా అడిగిన పలు ప్రశ్నలకి సమాధానమిచ్చారు.
అంతకముందు చిత్రంలో రాజగురువు పాత్ర పోషించిన అమితాబ్‌తో చిరంజీవి కలిశారు. ఆ సమయంలో వారితో పాటు ఫర్హాన్ అక్తర్ కూడా ఉన్నారు. అమితాబ్, ఫర్హాన్ అక్తర్, చిరంజీవి కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.