గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (09:19 IST)

యాక్షన్ సన్నివేశాల్లో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర తాజా అప్ డేట్

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం 4వ షెడ్యూల్ యాక్షన్ పార్ట్ మొదలైంది. వశిష్ఠ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న కొత్త షెడ్యూల్ నిన్న లింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. ఈనెల 19 వరకు జరగనున్న ఈ ఔటింగ్‌లో భారీ స్థాయిలో సెట్స్‌పై ఉన్న ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించనున్నారు. ఇందుకోసం ఓ సెట్‌ను ఏర్పాటు చేశారు. గత నెల నాల్గవ వారం మధ్యలో సాగిన చివరి షెడ్యూల్‌లో కొన్ని టాకీ భాగాలు,  రెండు పాటలను పూర్తి చేసిన తర్వాత చేస్తున్న షూటింగ్ ఇది. 
 
త్రిష నటిస్తున్న ఈ సినిమా ఇప్పటివరకు జరిగిన షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా మరో వైపు జరుగుతుంది. ఈ సినిమా కమర్షియల్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది.  వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ఇషా చావ్లా, సురభి, ఆశ్రిత, తనికెళ్ల భరణి,  హర్ష్ వర్ధన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు  ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.