చిరంజీవి, త్రిష కృష్ణన్ విశ్వంభర హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి
Chiranjeevi, Trisha, Keeravani
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసుకుంది. చిరంజీవి, త్రిష కృష్ణన్ తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్స్, పాట, యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించారు.
చిరంజీవి నివాసంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా మొత్తం బృందంతో పాటు త్రిష కృష్ణన్ కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. "ఇదొక లెజెండరీ, అద్భుతమైన రోజు! #విశ్వంభర” అని ఆమె పోస్ట్ చేశారు. చిరంజీవి, త్రిష, వశిష్ట, కీరవాణి, విక్రమ్, వంశీ, ఛోటా కె నాయుడు, ఎఎస్ ప్రకాష్ కనిపిస్తున్న మరో పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిచ్ ప్రొడక్షన్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో అద్భుతంగా వుండబోతోంది. .
కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ లిరిక్ రైట్స్ కాగా, శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా ఉన్నారు.
విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.