ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (11:25 IST)

యువ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి.. మెగాస్టార్ చిరంజీవి

chiranjeevi
దేశవ్యాప్తంగా త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, ఓటుకున్న విలువను ఆయన యువ ఓటర్లకు తెలియజెప్పేలా ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"మన దేశ 18వ లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. మీకు 18 సంవత్సరాలు వయసు వస్తే మీరు మొట్టమొదటిసారిగా ఓటు వేసే హక్కు పొందుతారు. మీ మొదటి ఓటు మన రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం వినియోగించండి. తప్పనిసరిగా ఓటు వేయండి" అంటూ చిరంజీవి యువ ఓటర్లకు పిలుపునిచ్చారు. 
 
ప్రచారం పిచ్చి పీక్‌కు చేరింది.. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌ల్లోనూ జగన్ ప్రచార వీడియోలు
 
ఏపీలోని అధికార వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రచారం పిచ్చి తారాస్థాయికి చేరింది. కనిపించిన ప్రతి చోటును, ప్రతి ప్రాంతాన్ని తన ప్రచారం కోసం వైకాపా నేతలు వినియోగించుకుంటున్నారు. ఇపుడు చివరకు బైజూస్ కంటెంట్‌తో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌ల్లోనూ ఎన్నికల ప్రచార వీడియోలు ప్రసారం చేస్తున్నారు. ఈ తరహా వీడియోలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెలుగు చూశాయి. 
 
బైజూస్‌ కంటెంట్‌ కాకుండా పిల్లలు అదనంగా నేర్చుకునేందుకంటూ ట్యాబ్‌ల్లో స్విప్ట్‌చాట్‌ యాప్‌ను వేశారు. దీన్ని ఓపెన్‌ చేస్తే యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వస్తున్నాయి. విద్యార్థులు వైఫైతో కనెక్ట్‌ అయి, యాప్‌ను ఓపెన్‌ చేయగానే జగన్‌ ప్రచార వీడియోలు వస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. సాధారణంగా ప్రకటన వస్తే దాన్ని వద్దనుకొని ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ, దీంట్లో డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ సైతం వస్తోంది. 
 
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8 తరగతి విద్యార్థులకు ఈ ట్యాబ్‌ల్లో స్విప్ట్‌చాట్‌లాంటి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసి, ఇచ్చారు. పాఠ్యాంశాలు తప్ప మరేవీ యాప్‌లో ఓపెన్‌ కాకుండా లాక్‌ చేశామని అధికారులు ఇంతకాలం చెబుతూ వస్తున్నారు. అలాంటప్పుడు స్విప్ట్‌చాట్‌ యాప్‌ను ఓపెన్‌ చేస్తే వైకాపా ప్రచార వీడియోలు ఎలా వస్తున్నాయి? ప్రభుత్వమే కావాలని పంపిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. స్విప్ట్‌చాట్‌ యాప్‌ ద్వారా కొందరు యూట్యూబ్‌లో సినిమాలూ చూస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.