1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (11:02 IST)

మెగా 154 లేటెస్ట్ అప్‌డేట్ కోసం ఆంధ్ర వెళుతున్న మెగాస్టార్‌

mega 154
mega 154
మెగాస్టార్ చిరంజీవి చిత్రాల షూటింగ్‌లు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. తాజాగా గాడ్ ఫాద‌ర్ చిత్రం షూటింగ్ పూర్త‌యి విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ద‌స‌రాకు ఈ సినిమా విడుద‌ల కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించేశారు. స‌ల్మాన్ ఖాన్ ఇందులో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి మ‌రో సినిమా మెగా 154. ఈ సినిమాకు దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) నేతృత్వం వ‌హిస్తున్నారు.
 
ఈ సినిమా మాత్రం రీమేక్ కాకుండా క‌రోనా త‌ర్వాత వ‌చ్చిన మార్పుల‌వ‌ల్ల స‌రికొత్త క‌థ‌తో బాబీ తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ కీల‌క పాత్ర పోషించ‌డం విశేషం. దాంతో ఈ సినిమాపై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. అయితే ఈ సినిమా తాజా షెడ్యూల్ సెప్టెంబ‌ర్ 21 నుంచి రాజ‌మండ్రిలో చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాలు చిరంజీవి బాగాక లిసి వ‌చ్చిన అంశాలు. ఇక ఈ చిత్రానికి అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.