1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (08:28 IST)

ఏపీలో కొత్తగా ఎంఈవో పోస్టుకు పోటీగా ఎంఈవో-2 - భర్తీకి నోటిఫికేషన్

andhrapradesh logo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం ఇపుడు వివాదాస్పదమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మండలానికో విద్యాశాఖాధికారి (ఎంఈవో) ఉన్నారు. ఇపుడు దీనికి సమాంతరంగా ఎంఈవో-2 పోస్టును సృష్టించారు. పైగా, ఎంఈవో-2 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ మేరకు శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. అకడెమిక్, నాన్ అకడెమిక్ కార్యకలాపాల పర్యవేక్షణకు ఈ కొత్త పోస్టును సృష్టిస్తున్నట్టు ఏపీ సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
నిజానికి గత రెండు దశాబ్దాల నుంచి ఈ తరహాలో కొత్త పోస్టులు సృష్టించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదేసమయంలో ఏకీకృత సర్వీస్ రూల్స్ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో విద్యాశాఖలో పదోన్నతులు నిలిచిపోయాయి. వెరసి మండల విద్యాశాఖాధికారులపై మోయలేని భారం పడింది. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంది. 
 
ఇదిలా ఉంటే... ఎంఈఓ-2 పేరిట కొత్త పోస్టుల‌ను సృష్టించిన ఏపీ ప్ర‌భుత్వం... ఆ కేట‌గిరీలో ఒకేసారి 679 పోస్టుల‌ను భ‌ర్తీ చేసేంద‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అదేస‌మ‌యంలో ఇప్ప‌టికే ఉన్న ఎంఈఓ-1 పోస్టుల్లో మ‌రో 13 పోస్టులను ఏర్పాటు చేసేందుకు కూడా ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కొత్త‌గా సృష్టించిన ఈ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ త్వ‌ర‌లోనే మొద‌లుకానున్న‌ట్లు స‌మాచారం.