శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (19:01 IST)

వచ్చే యేడాది నుంచి విశాఖ రాజధానిగా పాలన : మంత్రి గుడివాడ

వచ్చే యేడాది నుంచి విశాఖపట్టణం రాజధానిగా పాలన సాగుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖను రాజధానిగా చేసేందుకు ఒక్క సెంటు కూడా ప్రైవేటు భూమిని సేకరించలేదన్నారు. అదేసమయంలో తమ ప్రభుత్వ విధానమైన మూడు రాజధానుల విషయంలో రవ్వంత కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, అమరావతి నుంచి అరసవెల్లి వరకు ప్రభుత్వం చేపట్టిన పాదయాత్రలో ఏం జరిగినా అది టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలన్నారు. 
 
ఆయన శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో మంత్రి అమర్నాథ్ పాల్గొని ప్రసంగించారు. ఏపీకి అమరావతితో పాటు విశాఖ, కర్నూలను రాజధానులుగా మారుస్తామని ప్రకటించారు. ఈ విషయంలో తాము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. అందవల్ల వచ్చే యేడాది నుంచి విశాఖ రాజధానిగా పాలన సాగిస్తామని తెలిపారు. 
 
అదేసమయంలో అమరావతి రైతులు చేపట్టిన అమరావతి టు అరసవిల్లి వరకు రైతులు చేపట్టిన పాదయాత్రలో ఏ చిన్నపాటి సంఘటన జరిగినా దానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిదే బాధ్యత అని మంత్రి అమర్నాథ్ హెచ్చరించారు.