శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (17:23 IST)

అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్

narayanap
టీడీపీ సీనియర్ నేత, నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ పి.నారాయణకు ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది. అసైన్డ్ భూముల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల కుంభకోణంలో నారాయణ పేరను ప్రధాన నిందితుడిగా చేర్చారు. 
 
పైగా, ఈ కేసులో ఇప్పటికే ఏపీ సీఐడీ పోలీసులు పలువురుని అరెస్టు చేశారు. దీంతో తనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన నారాయణ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఆయనకు బుధవారం మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ విదేశాల్లో చికిత్స తీసుకోవాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇదే అంశం ఆధారంగా ఇది వరకే ఆయన ఓ కేసులో ముందస్తు బెయిల్ పొందారు. 
 
అయితే, అసైన్డ్ భూముల కేసులో నారాయణ కీలక నిందితుడిగా ఉన్నందున ఆయనకు బెయిల్ మంజూరు చేయరాదంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు నారాయణకు మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది.