మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (15:55 IST)

కుక్క పని కుక్క - గాడిద పని గాడిదే చేయాలి : కీరవాణి

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న సంగీత దర్శకుల్లో ఎంఎం కీరవాణి ఒకరు. 'బాహుబలి' చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చారు. ఈయన సంగీత దర్శకుడిగానే కాకుండా, ఓ గీత రచయితగా, గాయకుడుగా రాణిస్తున్నారు. తాజాగా ఆయనకు ఎదురైన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. 
 
బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్న మీరు... సినిమాల్లో నటించవచ్చు కదా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి కీరవాణి స్పందిస్తూ, కుక్క పని కుక్క, గాడిద పని గాడిదే చేయాలని, అలాగే, మనకు సంబంధించని, చేతకాని పని మనం చేయకూడదని అన్నారు. 
 
'యాక్టింగ్' అనేది 'నా స్వధర్మం కాదు' అని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా 'కరోనా' అంశంపై ఆయన మాట్లాడుతూ, 'కరోనా' కట్టడి నేపథ్యంలో ఎవరు ఏ సూచన చేసినా, ఏ కథ చెప్పినా, ఏ ఉదాహరణ చెప్పినా వాటి సారాంశం ఒక్కటేనని, 'ఇంట్లో ఉండండి.. బయటకు వెళ్లొద్దు' అని అన్నారు.