ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 జులై 2024 (13:35 IST)

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

Model Demi-Lee Tebow
Model Demi-Lee Tebow
భారతీయుడు2 నుండి క్యాలెండర్ సాంగ్  లిరికల్ వీడియో ఈరోజు సాయంత్రం విడుదల అవుతోంది. వేడిని పెంచుతోంది దాని కోసం సిద్ధంగా ఉండండి.. అంటూ దక్షిణాఫ్రికా మోడల్, మిస్ యూనివర్స్ 2017 కిరీటాన్ని పొందిన డెమి-లీ టెబో  డాన్సర్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అనిరుధ్ సంగీతం సమకూర్చగా చంద్రబోస్ సాహిత్యం రాశారు. కౌసర్ మునీర్, ఐశ్వర్యసురేష్, భార్గవి గాయకులుగా వ్యవహరించారు.
 
ఇప్పటికే భారత్ లోని వివిధ చోట్ల ప్రమోషన్ చిత్ర టీమ్ చేసింది. కమల్ హాసన్, ఎస్.జె. సూర్య, సిద్దార్థ వంటివారు ఈ సినిమా ప్రమోషన్ లో హైలైట్ అయ్యాయి.  అవినీతిపై పోరాడే సేనాపతిగా కమల్ నటిస్తున్నారు. యూత్ కు ప్రతినిధిగా సిద్దార్థ్ నటించారు. కథ ప్రకారం విదేశాల్లో కూడా చిత్రీకరణ వుంది. అందుకే సన్నివేశపరంగా మోడల్ డెమితో ఐటెం సాంగ్ చేసిందని తెలుస్తోంది.