ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 19 మార్చి 2018 (21:17 IST)

తన పుట్టిన రోజుకు మోహన్ బాబు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు వారంతా...(వీడియో)

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆప్తమిత్రులు, బంధువర్గం ఇలా ఒకరేమిటి అందరితో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తన సొంత విద్యాసంస్థ అయి

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆప్తమిత్రులు, బంధువర్గం ఇలా ఒకరేమిటి అందరితో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తన సొంత విద్యాసంస్థ అయిన చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని విద్యానికేతన్‌లో మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
 
అయితే తన పుట్టినరోజు వేడుకలకు ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, మరో నటి, కుమార్తె మంచు లక్ష్మి, నటులు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు మోహన్ బాబు. మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరూ మంచి స్నేహితురాళ్లు. దీంతో తన తండ్రి పుట్టినరోజు వేడుకలకు హాజరు కావాలని కోరితే వెంటనే రకుల్ తిరుపతికి వచ్చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన కుమార్తెతో సమానమని, ఇంత మంది మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు మోహన్ బాబు. శ్రీవారి సేవలో మోహన్ బాబు వీడియో చూడండి...