మోహన్ బాబు, మంచు విష్ణులపై కేసు.. ఎందుకో తెలిస్తే షాక్..
డ్రెస్ కోడ్ సరిగ్గా లేదన్న నెపంతో ఉద్యోగం నుంచి తొలగించారని ఓ మహిళ విద్యానికేతన్ అధినేత, యాజమాన్యంపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు అయ్యింది. చంద్రగిరి మండలం, రంగంపేట వద్దనున్న శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలలో హైదరాబా
డ్రెస్ కోడ్ సరిగ్గా లేదన్న నెపంతో ఉద్యోగం నుంచి తొలగించారని ఓ మహిళ విద్యానికేతన్ అధినేత, యాజమాన్యంపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు అయ్యింది. చంద్రగిరి మండలం, రంగంపేట వద్దనున్న శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలలో హైదరాబాద్‌కు చెందిన బ్యూలా 12వ తరగతి అధ్యాపకురాలిగా పనిచేస్తోంది.
నవంబర్ 28, 2017వ తేది కాలేజీకి వెళ్ళింది. డ్రెస్ కోడ్ సరిగ్గా లేదని కాలేజీ యాజమాన్యం మందలించడంతో అక్కడ నుంచి వెళ్ళిపోయింది. రెండు నెలలైనా కాలేజీకి రాకపోవడంతో కాలేజీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. విషయం తెలుసుకున్న బ్యూలా నోటీసులు ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని మీడియా ఎదుట వాపోయింది. తన భర్తతో కలసి గురువారం చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.
ఆమె ఫిర్యాదును స్వీకరించిన ఎస్.ఐ సురేష్ ప్రముఖ సినీనటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ మంచు మొహన్ బాబు, సిఇఓ మంచు విష్ణు, సిఎఓ తులసి నాయుడు, వైస్ ప్రిన్సిపల్ కిరేన్, హెచ్ ఆర్ మేనేజర్ జీవ రాజగోపాల్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయం చంద్రగిరిలో చర్చనీయాంశం అయ్యింది.