శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (11:22 IST)

చిత్ర నిర్మాణంలోకి ధోనీ దంపతులు.. తొలిసారి ఆ భాషలో...

sakshi dhoni
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన సతీమణి సాక్షి సింగ్ ధోనీలు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ధోనీ ఎంటర్‌టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ పేరుతో వారు సినిమాలు నిర్మించనున్నారు. తమ నిర్మాణ సంస్థపై తొలిసారి తమిళంలో ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి రమేష్ తమిళ్‌మణి దర్శకత్వం వహించనున్నారు. నటీనటుల వివరాలను వెల్లడించలేదు. ఈ నిర్మాణ సంస్థకు మేనేజింగ్ డైరెక్టరుగా సాక్షి సింగ్ వ్యవహరిస్తారు. 
 
ఈ సినిమా గురించి సాక్షి సింగ్ స్పందిస్తూ, ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుందని చెప్పారు. ఈ సినిమా స్టోరీని సాక్షి సింగ్ ధోనీనే రాయడం గమనార్హం. దర్శకుడు రమేష్ తమిళ్‌మణి మాట్లాడుతూ, సాక్షి రాసిన కథను తాను చదివిన క్షణంలో అద్భుతమైన అనుభూతికి గురయ్యాయనని చెప్పారు. కథ చాలా కొత్తగా ఉందని, ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రజలను ఆకట్టుకునే సత్తా ఈ కథకు ఉందని చెప్పారు.
dhoni entertainment
 
అలాగే, ఇతర ఫిల్మ్ మేకర్స్, కథా రచయితలతో కూడా చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. ఫిక్షన్, క్రైమ్, డ్రామా, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ కథలపై చర్చలు జరుగుతున్నాయని వారు వెల్లడించారు. క్రికెటర్‌గా అద్భుతంగా రాణించిన ధోనీ .. ఇపుడు సినిమా రంగంలో ఏ విధంగా రాణిస్తారో వేచి చూడాల్సివుంది.