Biodata Maker
✕

మ‌ల్టీప్లెక్స్‌లు బంద్

Updated: మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (18:44 IST)
Samavesam
కరోనా ప్రభావం సినిమా థియేటర్లపైనా పడింది. వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో రేపటి నుంచి థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏకగీవ్ర నిర్ణయం తీసుకున్నారు.
 
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండ‌డం..రోజు రోజూకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్ర‌మంలో ఏప్రిల్‌23న విడుద‌ల కావాల్సిన ప‌లు సినిమాల‌న్నీ వాయిదా ప‌డ్డాయి. ఇప్ప‌టికే ఈనెల 26న అనుకున్న `ట‌క్ జ‌గ‌దీష్‌` కూడా ఎప్పుడో వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్ప‌టి ప‌రిస్థితి రీత్యా దాదాపు మే నెల వ‌ర‌కు సినిమాల ప్ర‌ద‌ర్శ‌న ఉండ‌బోవ‌ని సినీవ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. యాభైశాతం సీటింగ్ వున్నా ప్రేక్ష‌కులు వ‌స్తారో రారో అనే సందిగ్థం నెల‌కొంది.
 
ఇదిలా వుండ‌గా, మంగ‌ళ‌శారంనాడు అత్య‌వ‌స‌ర స‌మావేశ‌మైన ఎగ్జిబిట‌ర్లు థియేట‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌పై స‌మావేశం నిర్వ‌హించారు. అయితే అందులో కేవ‌లం మ‌ల్టీప్లెక్స్‌లు బంద్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. మ‌ల్టీప్లెక్స్‌లోనే షాపింగ్ మాల్స్ కూడా వుండ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న క‌ర్వ్యూ కూడా వాటికి వ‌ర్తిస్తుంద‌ని వారు చ‌ర్చ‌ల సంద‌ర్భంగా తెలిపారు. 
అయితే మామూలు థియేట‌ర్లు ర‌న్ చేయ‌డానికి కొందరు ఎగ్జిబిట‌ర్లు సంసిద్ధ‌మ‌య్యారు. అవేవీ క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ కాదు క‌నుక వాటిని ర‌న్ చేయ‌వ‌చ్చ‌ని స‌మావేశంలో ఇరు వ‌ర్గాల ఎగ్జిబిట‌ర్లు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే వ‌ర్మ `దెయ్యం` వంటి కొన్ని చిన్న సినిమాలు ఆయా థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతోంది. మ‌రి కొద్దిరోజుల్లో ఆ నిర్ణ‌యం కూడా మారిపోవ‌చ్చ‌ని తెలుస్తోంది.

ఫైన‌ల్‌గా. వకీల్‌ సాబ్‌ సినిమా ప్రదర్శించే థియేటర్లు మినహా మిగితా వాటిని మూసివేయాలని సమావేశంలో నిర్ణయించారు.
కరోనా ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్ల నిర్వాహకులు తెలిపారు.
 
 

అన్నీ చూడండి

చేవెళ్ళలో రేవ్ పార్టీ - 108 మంది విద్యార్థుల అరెస్టు

అర్నబ్ తుఫాను : ఏపీలో పర్యటించనున్న కేంద్ర బృందాలు

భారత వాయుసేన చీఫ్‌గా మార్షల్ ఇందర్‌పాల్ సింగ్ వాలియా

లండన్‌లో చదువుకుంటుందని అనుకుంటే ఫ్లాట్‌లో విగతజీవిగా ఉంది...

Weather forecast: అక్టోబర్ 31, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అన్నీ చూడండి

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?

విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం

కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్‌కు చికిత్స

గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు

హెచ్‌సీజీ విశాఖ, ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన

తర్వాతి కథనం
Show comments