బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (14:57 IST)

ఈరోజు మంచి బిగినింగ్ అంటున్న‌ రామ్చ‌ర‌ణ్

Ramcharan
రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం షూటింగ్ బిజీలో వున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న `ఆర్‌.ఆర్‌.ఆర్‌.` చిత్రీక‌ర‌ణ‌లో వున్న చ‌ర‌ణ్ షూటింగ్ వెళ్ళేందుకు ఉద‌యం త‌ను చేస్తున్న క‌స‌రత్తుల‌కు చెందిన స్టిల్‌ను పోస్ట్ చేశాడు. ప్ర‌తిరోజూ నాన్న‌గారిని చూసి నేర్చుకునేవాడిని. ఆయ‌నే నా గురువు. వ్యాయామం అనేది రోజూవారీ దిన‌చ‌ర్య‌లో భాగంగా రామ్‌చ‌ర‌ణ్ పేర్కొన్నాడు.

ఒక్కోసారి వ్యాయామంలో భాగంగా డాన్స్ కూడా చేయాల్సి వుంటుంది. అయితే ఈరోజు అందుకు స‌మ‌యం స‌రిపోలేదు. కేవ‌లం వ్యాయామం చేయ‌డానికి కుదిరింది అన్న‌ట్లుగా ఫొటో వుంది. ఈరోజు మంచి బిగినింగ్‌తో ప్రారంభించాన‌ని ట్వీట్ చేశాడు. వ్యాయామంలో భాగంగా బెంచ్‌ప్రెస్‌, లెగ్ ప్రెస్‌, పుష‌ప్క్ వంటి వ‌ర్క‌వుట్స్ చ‌ర‌న్ చేస్తుంటారు. ఈయ‌న్ను ఫాలో అయి ఆయ‌న అభిమానులు కూడా కొంద‌రు వ‌ర్క‌వుట్లు చేయ‌డం విశేషం.

ఆర్‌.ఆర్‌.ఆర్‌.లో ఆయ‌న అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తున్న విష‌యం విదిత‌మే. ఇందుకు సంబంధించిన స్టిల్‌ను ఇటీవ‌లే చ‌ర‌ణ్ త‌న పుట్టిన‌రోజునాడు విడుద‌ల‌చేశారు. అల్లూరి సీతారామారాజుగా ఆయ‌న అంద‌రినీ మెప్పించాడు. అలా మెప్పించాలంటే ఇలాంటి క‌స‌ర‌త్తులు అవ‌స‌రం. అందుకే ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి షూటింగ్ ముందు క‌స‌ర‌త్తులు కంప‌ల్‌స‌రీ చేసి త‌ను కూడా వ్యాయామం చేస్తుంటాడు.