గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 27 జులై 2017 (11:51 IST)

'బిగ్ బాస్' నిర్వాహకుల పర్మిషన్.. సిట్ ముందుకు ముమైత్ ఖాన్...

బిగ్ బాగ్ నిర్వాహకులు అనుమతి ఇవ్వడంతో డ్రగ్స్ కేసు విచారణ నిమిత్తం నటి ముమైత్ ఖాన్ పూణే నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఈ డ్రగ్స్ స్కామ్‌లో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న

బిగ్ బాగ్ నిర్వాహకులు అనుమతి ఇవ్వడంతో డ్రగ్స్ కేసు విచారణ నిమిత్తం నటి ముమైత్ ఖాన్ పూణే నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఈ డ్రగ్స్ స్కామ్‌లో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సినీ ప్రముఖుల వద్ద విచారణ జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, చిన్నా, చార్మీల వద్ద సిట్ అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో భాగంగా, గురువారం ముమైత్ ఖాన్‌ వద్ద విచారణ జరుపుతున్నారు. ఈ విచారణ ఎదుర్కొంటున్న వారిలో రెండో మహిళ ముమైత్ కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో నుంచి ముమైత్ ఖాన్ శాశ్వతంగా వైదొలిగినట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చే సమయంలో ముమైత్‌కు సహచరులు కన్నీటితో వీడ్కోలు పలికారు. అయితే ముమైత్ ఖాన్ షో నుంచి పర్మినెంట్‌గా తప్పుకోకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. 
 
ముమైత్ ఖాన్‌తో పాటు సిట్ కార్యాలయానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా రావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. ఆమె ప్రతి కదలికను బిగ్ బాస్ షో నిర్వాహకులు గమనిస్తున్నట్లు సమాచారం. ఆమె తిరిగి పుణె వెళ్లేంత వరకూ ఫోన్ కూడా ఇవ్వట్లేదని తెలుస్తోంది.