శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2024 (13:00 IST)

Murari 4K Re release.. మహేష్ బర్త్ డే గిఫ్ట్.. హాట్ కేకుల్లా టిక్కెట్లు సేల్

Murari 4K Re release
Murari 4K Re release
కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన 2001 బ్లాక్ బస్టర్ సూపర్ నేచురల్ ఫ్యామిలీ డ్రామా మురారి. సూపర్ స్టార్ మహేష్ బాబు టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించింది. మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్ట్ 9న మరోసారి అప్‌గ్రేడ్ చేసిన 4కే వెర్షన్‌లో మురారి సినిమా రీ-రిలీజ్ కానుంది.
 
మురారి సినిమా ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మురారి 4Kగా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే సినిమా ప్రీ-సేల్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. మురారి మహేష్ బాబు కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది.
 
ఒక్క హైదరాబాద్‌లోనే ముందస్తు టిక్కెట్ల విక్రయాలు రీరిలీజ్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాయి. అదనంగా, ఈ చిత్రం ఆగస్టు 3న 38.4కె టిక్కెట్లను విక్రయించింది. ఆగస్ట్ 4న మురారి 26.61 K టిక్కెట్లను విక్రయించారు. ఇకపోతే.. ఈ సినిమా రీ-రిలీజ్ హైదరాబాద్‌లో 20గంటల్లోనే కోటి రూపాయలు దాటింది. ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానున్న ఈ సినిమా రూ.2 కోట్ల వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని స‌మాచారం.