అంతర్జాలంలో పెండ్లి చూసి ఆన్లైన్లో ఆశీర్వదించగలరు...
కరోనా కాలంలో పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇక పెళ్లిళ్ల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెడ్డింగ్ కార్డ్ నుండి పద్దతుల వరకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. తాజాగా మై విలేజ్ షో ఫేం, యూట్యూబర్ అనీల్ జీల తన పెళ్లి కూడా కరోనా కాలంలో కొంత డిఫరెంట్‌గా చేసుకోబోతున్నాడు.
తాజాగా తన పెండ్లిపత్రికను అనీల్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది నెటిజన్స్‌కు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు స్థానాలలో శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అని ఉండగా, వధూవరుల పక్కన కోవిడ్ నెగెటివ్ అని రాసి ఉంది.
ఇక అందరు మరువకుండా మీ ఫోన్ల 1-జీబీ డాటా ఆగపట్టుకొని పిల్లా.. జెల్లా.. ఐసోల్లు.. ముసలోల్లు అందరూ ఫోన్ల ముందు అంతర్జాలంలో పెండ్లిసూసి ఆన్లైన్లో ఆశీర్వదించగలరు. విందు..లైవ్‌లో తల్వాలు పడ్డంక ఎవ్వరింట్ల ఆళ్లు బువ్వు తినుర్రి.
బరాత్ ఉంది కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగురుర్రి. మీరు ఎగిరిన15 సెకన్ల వీడియో మాకు పంపుర్రి..దాన్ని వ్లోగ్‌లో పెడతాం. ఇక కట్నాలు, కానుకలు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా క్యూఆర్ స్కాన్ చేసి పంపండి అంటూ తన వెడ్డింగ్ కార్డ్‌ను ఫన్నీగా రూపొందించాడు. కాగా, అనీల్.. గంగవ్వతో కలిసి పలు యూట్యూబ్ వీడియోలు చేసిన విషయం తెలిసిందే.