ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 24 జనవరి 2025 (18:49 IST)

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

Anantika Sanil Kumar, Hanu Reddy
Anantika Sanil Kumar, Hanu Reddy
మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని విమర్శకుల ప్రశంసలు పొంది ‘మను’తో దర్శకుడిగా డెబ్యు చేసి దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ‘8 వసంతాలు’ను నిర్మిస్తున్నారు. MAD ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ఈ మూవీలో హీరోయన్. ఇందులో ఆమె శుద్ధి అయోధ్య పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం  ఫస్ట్ లుక్ పోస్టర్,  గ్లింప్స్‌తో ఇప్పటికే మంచి క్రియేట్ చేసింది.
 
కొత్తగా విడుదలైన టీజర్ విడిపోవడం వల్ల కలిగే బాధలతో వున్న కన్న పసునూరిని అవంతిక ఓదార్చడంతో ప్రారంభమవుతుంది. అతని దుఃఖం లోతును ఆమె అర్థం చేసుకోలేదని చెప్పడంతో హను రెడ్డితో తన ఫస్ట్ లవ్ ని రివిల్ చేస్తోంది. “ఎవరి తుపాన్ లు వారికి వుంటాయి లోపల. కొందరు బయట పడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు' ఈ డైలాగ్ క్యారెక్టర్స్ బ్యాక్ డ్రాప్ ని ఎమోషనల్ గా ప్రజెంట్ చేసింది. ఫణీంద్ర నర్సెట్టి రైటింగ్ కథనంలో పొయిటిక్ టచ్, రివర్స్ ఫ్లాష్‌బ్యాక్‌తో చేయడం టీజర్‌కు డెప్త్ యాడ్ చేసింది.
 
అనంతిక సనిల్‌కుమార్ పాత్ర ఆకట్టుకుంటుంది, టీజర్ కన్న పసునూరి, హను రెడ్డి యొక్క కీలక పాత్రలను కూడా పరిచయం చేస్తుంది. విశ్వనాథ్ రెడ్డి ఛాయాగ్రహణం విజువల్ గా అద్భుతంగా వుంది.    హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ఎమోషనల్ డెప్త్ ని కంప్లీట్ చేసింది. ఈ టీజర్ ఎమోషనల్ లేయర్స్ కి స్టేజ్ ని సెట్ చేసింది.
 
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ మూవీగా రూపొందుతోంది. ఈ చిత్రానికి అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్‌గా, శశాంక్ మాలి ఎడిటర్‌గా, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.  
 
నటీనటులు: అనంతిక సనీల్ కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్