బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 19 ఏప్రియల్ 2018 (11:24 IST)

''నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'' ఆడియో వేదిక అక్కడే.. బన్నీ, అనూ సెల్ఫీ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న''నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'' ఆడియో వేడుక ఈనెల 22న నిర్వహించనున్నారు. సినిమా మిలటరీ ప్రధానంగా చిత్రీకరించడంతో పాటు హీరో అల్లు అర్జున్‌ సైనికుడిగా న

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న''నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'' ఆడియో వేడుక ఈనెల 22న నిర్వహించనున్నారు. సినిమా మిలటరీ ప్రధానంగా చిత్రీకరించడంతో పాటు హీరో అల్లు అర్జున్‌ సైనికుడిగా నటించడంతో ఈ ఆడియో వేడుక తాడేపల్లిగూడెం మండలం మిలటరి మాధవరంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


ఈ ఆడియో వేడుకకు జిల్లాలోని మాజీ సైనికోద్యోగులు, సైనికులు తెల్ల షర్ట్‌, నల్లఫ్యాంట్‌ ధరించి ఈనెల 22 సాయంత్రం 4.30గంటలకు హాజరు కావాలని మాజీ సైనికోద్యోగుల సంఘం వెల్లడించింది. 
 
మరోవైపు అల్లు అర్జున్ హీరోగా అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అనూ ఇమ్మాన్యుయేల్ కోరిక మేరకు బన్నీ ఒక సెల్ఫీ తీసిచ్చాడు. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా చేసిన ఈ సినిమా, దేశభక్తి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 22వ తీదీన ఆడియో వేడుకను నిర్వహించి, 29వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపనున్నారు. మే 4వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతుంది.