శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: శనివారం, 8 సెప్టెంబరు 2018 (20:21 IST)

హైద‌రాబాద్‌లో చైతు-చెన్నైలో స‌మంత‌.. ఏం జ‌రిగింది?

అక్కినేని నాగ చైత‌న్య - స‌మంత పెళ్లి చేసుకుని ఎవ‌రి సినిమాల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే.. చైత‌న్య తాజా చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు. ఈ సినిమా వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ నెల 13న రిలీజ్ అవుతుంది. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచ‌నాల

అక్కినేని నాగ చైత‌న్య - స‌మంత పెళ్లి చేసుకుని ఎవ‌రి సినిమాల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే.. చైత‌న్య తాజా చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు. ఈ సినిమా వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ నెల 13న రిలీజ్ అవుతుంది. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఇక ఇదే రోజున స‌మంత న‌టించిన యూ ట‌ర్న్ చిత్రం కూడా రిలీజ్ అవుతుంది. 
 
ఇలా భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతున్నారు. టాలీవుడ్ చ‌రిత్ర‌లో ఇలా భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రూ పోటీప‌డ‌టం ఇదే ఫ‌స్ట్ టైమ్. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... చైత‌న్య హైద‌రాబాద్‌లో ప్ర‌మోష‌న్స్‌లో ఫుల్ బిజీగా ఉంటే.. స‌మంత చెన్నైలో ప్ర‌మోష‌న్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. చెన్నైలో ప్ర‌మోష‌న్ ఏంటంటే.. యూట‌ర్న్ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్‌లో కూడా రూపొందించారు. అందుచేత హైద‌రాబాద్‌లో చైతు, చెన్నైలో స‌మంత ఫుల్ బిజీ. మ‌రి... ఈ బాక్సాఫీస్ వార్‌లో ఎవ‌రు విన్న‌ర్‌గా నిలుస్తారో చూడాలి.