ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 14 జనవరి 2018 (14:56 IST)

సందడి చేసిన బాలయ్య... ఫ్యాన్స్‌తో కలిసి ‘జై సింహా’ తిలకించిన నేత

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ తిరుపతిలో సందడి చేశారు. సంక్రాంతి పండుగ కోసం చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు వచ్చిన ఆయన... భోగి మంటలు వేసి అక్కడ నుంచి

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ తిరుపతిలో సందడి చేశారు. సంక్రాంతి పండుగ కోసం చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు వచ్చిన ఆయన... భోగి మంటలు వేసి అక్కడ నుంచి నేరుగా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత దిగువ తిరుపతిలో ఆయన సందడి చేశారు. ముఖ్యంగా, ఆయన నటించిన తాజా చిత్రం "జైసింహా". ఈనెల 12వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం తిరుపతిలోని గ్రూపు థియేటర్‌లో ప్రదర్శితమవుతోంది. దీంతో బాలకృష్ణ తన అభిమానులతో కలిసి ఈ సినిమాను తిలకించారు. 
 
అనంతరం, బాలకృష్ణ  మీడియాతో మాట్లాడుతూ, ప్రేక్షకులు ఎప్పుడూ తమ వెంటే ఉంటారని, సంక్రాంతి పండగకు ప్రేక్షకులు తనకు అందించిన విజయకానుక ‘జైసింహా’ అని అన్నారు. ఈ సందర్భంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ గురించి ప్రస్తావిస్తూ, త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించనున్నట్టు చెప్పారు.