మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (09:14 IST)

శ్రీవారి భక్తులకు తీపికబురు... కోరినన్ని లడ్డూలు

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ తీపికబురు చెప్పింది. ఇప్పటివరకూ రెండు లడ్డూలు మాత్రమే ఇస్తుండగా ఇకపై అదనంగా 10 లడ్డూల వరకు ఇవ్వనున్నారు.

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ తీపికబురు చెప్పింది. ఇప్పటివరకూ రెండు లడ్డూలు మాత్రమే ఇస్తుండగా ఇకపై అదనంగా 10 లడ్డూల వరకు ఇవ్వనున్నారు. భక్తులకు కోరినన్ని లడ్డూలు అందజేయాలన్న లక్ష్యంతో ఇటీవల లడ్డూల తయారీని పెంచడంతో దాదాపు 7లక్షల లడ్డూలు నిల్వ ఏర్పడ్డాయి. 
 
దీంతో మంగళవారం నుంచి ఎటువంటి సిఫారసు లేకుండా భక్తుడు కోరితే 6 లడ్డూల వరకు ఇస్తామని తితిదే ప్రకటించింది. అయితే బుధవారం కూడా కోటా మిగిలే పరిస్థితి రావడంతో జేఈవో శ్రీనివాసరాజు సీనియర్‌ అధికారులతో చర్చించి భక్తుడు కోరితే 10 లడ్డూల వరకు ఇవ్వాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించారు.
 
దీంతో బుధవారం మధ్యాహ్నం నుంచి రూ.50 చొప్పున భక్తులకు 10 లడ్డూల వరకు జారీచేశారు. ఇకమీదట కూడా భక్తులకు ఎటువంటి సిఫారసు లేకుండా ఒక్కొక్కరికి 10 లడ్డూలు అందివ్వనున్నారు.