మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 28 డిశెంబరు 2017 (17:31 IST)

దర్శనం కోసం తిరుమలకు వెళ్ళాల్సిన పనిలేదు.. బయటే కనిపిస్తున్నాడు దేవుడు..?

ఇదేంటి.. శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే 20 కిలోమీటర్లు వాహనంపై వెళ్ళాలి. లేకుంటే మెట్లెక్కి వెళ్ళాలి. అలాంటిది దేవుడు బయటే కనిపించేస్తున్నారేంటి అనుకుంటున్నారా. నిజమేనండి. స్వామివారి దర్శనానికి రెండురోజుల సమయం పడుతోంది. క్యూ లైన్ల ద్వారా కంపార్టుమెం

ఇదేంటి.. శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే 20 కిలోమీటర్లు వాహనంపై వెళ్ళాలి. లేకుంటే మెట్లెక్కి వెళ్ళాలి. అలాంటిది దేవుడు బయటే కనిపించేస్తున్నారేంటి అనుకుంటున్నారా. నిజమేనండి. స్వామివారి దర్శనానికి రెండురోజుల సమయం పడుతోంది. క్యూ లైన్ల ద్వారా కంపార్టుమెంట్లలోకి వెళుతున్న భక్తులకు గంటల తరబడి సమయం పడుతోంది. ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్న శ్రీవారి భక్తులు గోవిందా.. గోవిందా అంటూ స్వామివారిని ముందే దర్శించేసుకుంటున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో పరిస్థితి.
 
వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో గురువారం అర్థరాత్రి వైకుంఠ ద్వారాలను తెరవనున్నారు. రెండు రోజుల పాటు ఏకాదశి, ద్వాదశి రోజు ద్వారాలు తెరిచే ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారిని దర్శించుకుంటే ఎంతో మంచిదని, పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీంతో భక్తులు అశేషంగా తిరుమలకు తరలివచ్చారు. నిన్న అర్థరాత్రి కంపార్టుమెంట్లు నిండిపోయి క్యూలైన్లు బయటకు వచ్చేసింది. 
 
రేపు 7గంటల తరువాత కొద్దిసేపు విఐపిలను దర్శనానికి అనుమతిస్తారు. ఆ తరువాత మొత్తం సర్వదర్శనమే. వైకుంఠ ఏకాదశి కావడంతో ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం కల్పిస్తోంది టిటిడి.