శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 29 ఆగస్టు 2018 (17:24 IST)

రోడ్డు ప్రయాణంలో జాగ్రత్త.. మీ ఇంట్లో మీకోసం ఎదురు చూసేవారు ఉంటారు...

రోడ్డు ప్రయాణంలో జాగ్రత్త.. మీ ఇంట్లో మీకోసం ఎదురు చూసేవారు ఉంటారు.. ఇలా నలుగురికి మంచి చెప్పే కుటుంబంలోనే ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం టాలీవుడ్ అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు.

రోడ్డు ప్రయాణంలో జాగ్రత్త.. మీ ఇంట్లో మీకోసం ఎదురు చూసేవారు ఉంటారు.. ఇలా నలుగురికి మంచి చెప్పే కుటుంబంలోనే ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం టాలీవుడ్ అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి సినిమా ఫంక్షన్‌లోనూ నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు పదేపదే ఈ మాటలు చెబుతుంటారు. కానీ, వారు తమ తండ్రి హరికృష్ణకి మాత్రం ఈ మాటలు చెప్పినట్టు లేదు. అందుకే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళుతూ రోడ్డు ప్రమాదానికి మృత్యుఒడిలోకి చేరుకున్నారు.
 
తమ అన్న జానికిరామ్ మరణం తర్వాత ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తమ సినిమాలు ప్రారంభమయ్యే సమయంలో 'రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీమీదే ఆశలు, మీమీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తుంటారు. మా కుటుంబంలో జరిగిన విషాదం, ఏ కుటుంబంలోనూ జరగకూడదని ఆశిస్తున్నాము' అంటూ ఓ సందేశాన్ని ఇస్తుంటారు. అలా అందరి మంచి కోరుకునే కుటుంబంలో మరో విషాదం జరగడం అందరనీ కలచి వేస్తోంది. ఈ వార్త విన్నప్పటి నుంచి నందమూరి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.