నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ సెన్సార్ పూర్తి

గురువారం, 21 డిశెంబరు 2023 (16:48 IST)
Devil- kalyan ram
నందమూరి  కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్స్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది.
 
రీసెంట్‌గా విడులదైన డెవిల్ మూవీ ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. పీరియాడిక్ జోనర్‌లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఆడియెన్స్‌కి ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. లేటెస్ట్‌గా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 26 నిమిషాలుగా రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. డెవిల్ సినిమాపై పాజిటివ్ టాక్‌ రావటంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  
 
కళ్యాణ్ రామ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెప్పించనున్నాయి. దీంతో పాటు డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ఆడియెన్స్‌ని అలరించనున్నాయి.
 
తెలుగులో అద్భుతమైన చిత్రాలను రూపొందించిన అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై డెవిల్ మూవీ రానుంది. ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ ఆధ్వర్యంలో డెవిల్ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన లోకాన్ని క్రియేట్ చేశారు. దీనికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ తోడు కావటంతో విజువల్స్ నెక్ట్స్ రేంజ్‌లో మెప్పించనున్నాయి. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేసిన ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించారు.

అన్నీ చూడండి

విద్యార్థినికి 60 మార్కులు వస్తే 5 మార్కులుగా చూపించిన లెక్చరర్, డిబార్ చేసిన అధికారులు

అమ్మా క్యాంటీన్లలో రుచికరమైన ఆహారం అందించండి.. సీఎం విజయ్ ఆదేశాలు

నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ - ఎన్టీఏ అధికారులకు సమన్లు

రోడ్లపై నమాజ్ చేస్తే ఊరుకోం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

స్కార్పియో, పది లక్షలు, బంగారం, 16 ఉంగరాలు ఇచ్చినా సరిపోలేదు.. వివాహితను ఏం చేశారు?

అన్నీ చూడండి

లివర్ ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

తర్వాతి కథనం
Show comments