సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (17:52 IST)

నేనేమైనా దేవతనా ఎప్పుడూ ఒకేలా వుండటానికి, బాడీ షేప్ పైన నందిత శ్వేత

Nandita Shweta
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో అల‌రించిన నందిత శ్వేతా బొద్దుగా చూడ‌ముచ్చ‌ట‌గా వుండేది. ఆ త‌ర్వాత చాలా మార్పు వ‌చ్చింది. అయితే ఇటీవ‌లే త‌న బాడీ షేప్ గురించి ఇన్‌స్టాగ్రాంలో ఫాలోవ‌ర్స్ స్పందించారు. కొంద‌రు నందిత షేర్ చేసిన ఫొటోను బాగుంద‌ని స్పందిస్తే, మ‌రికొంద‌రు ఘాటుగా స్పందించారు.


ఓ నెటిజ‌న్ మాత్రం.. దయచేసి మీ శరీరంపై దృష్టి పెట్టండి.. ఒక్కసారి నీ షేప్స్ చూసుకో ఆంటీలా తయారవుతున్నావ్.. వర్క్ అవుట్స్ చెయ్" అంటూ క్లాస్ పీకాడు. దాంతో నందిత ఆగ్రహం వ్యక్తం చేసింది. సోష‌ల్ మీడియాలోనే ఓ లెట‌ర్ రాసింది.

 
మ‌నుషుల‌్లో ఇలాంటి వారు కూడా ఉంటారా.. ఇలాంటివారితో నరకం. నేనేమైనా దేవతనా.. ఎప్పుడూ ఒకేలా ఉండడానికి. నాకు బాధలు, ఫీలింగ్స్, ఇబ్బందులు ఉంటాయి. ఆ సమయంలో నేను ఎలా ఉంటానో దాన్నే ఇష్టపడతాను.. నా శరీరం ఎలా ఉన్నా నేను దాన్ని ప్రేమిస్తాను" అని కామెంట్స్ పోస్ట్ చేసింది.


గ‌తంలో అనసూయ, తాప్సీ, లావణ్య త్రిపాఠిల‌ను కూడా ఆంటీలా వున్నావంటూ స్పందిస్తే.. తిరిగి అన‌సూయ అంతే రేంజ్‌లో స్పందించింది. మా ఆయ‌న‌కు లేని బాధ మీకెందుకు? అంటూ తెగేసి చెప్పింది.